https://oktelugu.com/

మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కేదెవరికి?

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇన్నాళ్లు మంత్రులుగా ఉన్న వాళ్లు కొందరు పదవీ త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఎవరి పదవులు ఉంటాయో ఎవరివి ఊడుతాయో తెలియడం లేదు.2019 కేబినెట్ సమావేశంలోనే పదవులు రెండున్నరే్ళ్ల పాటు ఉంటాయని తరువాత మారుస్తామని చెప్పారు. కొంతమంది మంత్రుల శాఖలు మారవచ్చని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ధీంతో ఇక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. […]

Written By: , Updated On : June 30, 2021 / 04:38 PM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇన్నాళ్లు మంత్రులుగా ఉన్న వాళ్లు కొందరు పదవీ త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఎవరి పదవులు ఉంటాయో ఎవరివి ఊడుతాయో తెలియడం లేదు.2019 కేబినెట్ సమావేశంలోనే పదవులు రెండున్నరే్ళ్ల పాటు ఉంటాయని తరువాత మారుస్తామని చెప్పారు. కొంతమంది మంత్రుల శాఖలు మారవచ్చని తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ధీంతో ఇక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరి శాఖలు మారే అవకాశాలు లేనందున వీరు కొనసాగుతారని తెలుస్తోంది.పార్టీలో సినియర్ నాయకులు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.దీంతో మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.

మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు. నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గం నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డితోపాటు ప్రసన్నకుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్థన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అధినేత అండదండలు ఎవరికి ఉంటాయో చెప్పడం కష్టంగా మారింది. మరోవైపు మేకపాటి కుటుంబంతోఉన్న సాన్నిహిత్యం కారణంగా గౌతమ్ ను తప్పిస్తారో లేదో అనే అనుమానాలు కలుగుతున్నాయి.

నెల్లూరు జిల్లా నుంచే సమీకరణలు ప్రారంభమవుతాయనే విషయం తెలుస్తోంది. ఇక్కడి నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ పారిశ్రామిక వేత్త వైసీపీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. సీనియర్లను కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వరని చాలా మంది విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఎవరి అంచనాలు వారికున్నాయి. అధినేత ప్రాపకం ఎంతమంది సాధిస్తారో వేచి చూడాల్సిందే.