Union Minister Piyush Goyal: ఏపీలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దయింది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక లోపం బయటపడింది. దీంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం, వీవీఐపీల వాడే హెలికాప్టర్ లో టెక్నికల్, సెక్యూరిటీ సమస్యలపై నివేదిక ఇవ్వాలని డీజీపీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.