
తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శని, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొంది.