
Bigg Boss 5 Telugu: తెలుగులోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మొదలైంది. ఆదివారం ప్రసారం కానున్న బిగ్ బాస్ షోను శనివారం షూటింగ్ పూర్తి చేశారు. 5వ సీజన్ ఘనంగా ప్రారంభమైనట్టు తెలిసింది. స్టార్ మా చానెల్ ఈరోజు షూటింగ్ ను నిర్వహించి హౌస్ లోకి కంటెస్టెంట్లను పంపినట్లు తెలిసింది. దీంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి.
రేపు సెప్టెంబర్ 5న బిగ్ బాస్ అధికారికంగా మొదలు కానుంది. అయితే ఈ షూటింగ్ శనివారం పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈరోజు ద్విగిజయంగా కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి నాగార్జున పంపారు. ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా నిర్వహించినట్టు తెలిసింది.
కొద్దిరోజులుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్లను తాజ్ డెక్కన్, మారియట్ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న పార్టిసిపెంట్లను ప్రస్తుతం హౌస్ లోకి ప్రవేశపెడుతున్నారు. ఈ సాయంత్రానికి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ పూర్తి కానుంది.
ఇక రేపు సాయంత్రం బిగ్ బాస్ ప్రసారం కానుంది. ఇక ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై కూడా స్పష్టత వచ్చేసింది.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్న కంటెస్టెంట్స్ ను చూస్తే యాంకర్ రవి, య్యూట్యూబర్ సరయు, ఆనీ మాస్టర్, సీరియల్ హీరో మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, సీనియర్ నటి ప్రియ, నటరాజ్ మాస్టార్, నటి శ్వేత వర్మ, లహరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం.
తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం నటుడు విశ్వ, సింగర్ శ్రీరామచంద్ర కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.