భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలు వణికిపోతున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. వర్షాలకు కరీంనగర్ సిటీ నీటమునిగింది. మెయిన్ రోడ్లతో పాటు గల్లీ రోడ్లపై భారీగా నీరు నిలిచింది. పలు కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్లు వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి.