Group 1 Telangana: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ వ్యవహారంపై విచారణను హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని టీజీపీఎస్, ఇతర న్యాయవాదులు కోరడంతో విచారణ వాయిదా పడింది. ఎగ్జామ్ సెంటర్ల కేటాయింప, వాల్యుయేషన్ లో అక్రమాలు జరిగాయని పలువురు కోర్టును ఆశ్రయించగా నియామకాలపై స్టే విధించిన సంగతి తెలిసిందే. ఆ స్టేను ఎత్తివేయాలంటూ ఎంపికైన అభ్యర్థులు పిటిషన్లు వేయగా నేడు వాదనలు జరిగాయి.