
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. నిన్న మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ హరీశ్ రావు కూడా పలు సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలు ఉండొచ్చు. పార్టీలో ఉండాలా వెళ్లిపోవాలా అనేది ఆయన ఇష్టం. తన సమస్యలకు నా పేరును ప్రస్తవించడం ఈటల విచక్షణాలేమికి నిదర్శనం. నా గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అని హరీశ్ రావు ఓ ప్రకటనలో తెలిపారు.