ఈటల.. ఎంత పని చేశావ్?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్ణయంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. సొంతంగా పార్టీపెట్టి కేసీఆర్ పై పోరాడతారనే అందరూ ఊహించారు. కానీ ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఢీకొనే శక్తిగా మారతారనుకుంటే ఆయన వేరే పార్టీలో చేరడం సమంజసంగా లేదని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ కు తెలంగాణ సర్కారు అన్యాయం చేసింది. ఇది అందరూ ఒప్పుకుంటారు. కానీ ప్రతీకారం తీర్చుకోవాలంటే వేరే పార్టీలో చేరడం కాదు ఒంటరిగా ఎదుర్కోగల […]

Written By: Srinivas, Updated On : June 5, 2021 6:20 pm
Follow us on

మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్ణయంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. సొంతంగా పార్టీపెట్టి కేసీఆర్ పై పోరాడతారనే అందరూ ఊహించారు. కానీ ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఢీకొనే శక్తిగా మారతారనుకుంటే ఆయన వేరే పార్టీలో చేరడం సమంజసంగా లేదని పేర్కొన్నారు.

ఈటల రాజేందర్ కు తెలంగాణ సర్కారు అన్యాయం చేసింది. ఇది అందరూ ఒప్పుకుంటారు. కానీ ప్రతీకారం తీర్చుకోవాలంటే వేరే పార్టీలో చేరడం కాదు ఒంటరిగా ఎదుర్కోగల సత్తా ఉండాలని భావిస్తుంటారు. శనివారం కోదండరామ్ మాట్లాడుతూ ఈటల వ్యవహారంపై పెదవి విప్పారు. ఈటల ఒంటరిగానే పోాటం చేస్తారని భావించామన్నారు. చివరికి బీజేపీ తీర్థం తీసుకోనుండడంతో ఇంకా ఏం మాట్లాడతామని చెప్పారు.

రెండో ప్రత్యామ్నాయంగా ఈటల ఎదుగుతారని అందరూ ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీలో చేరనున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో చేరినా వారి ఇష్టానుసారమే అని చెబుతున్నారు. ఈటల నిర్ణయంతో నాయకులు ఖంగుతిన్నారు. ఇన్నాళ్లు ఎదురు చూసిన వారికి చేదు కబురే మిగిలింది.

బీజేపీలో చేరాన్న కాంక్ష ఆయన వ్యక్తిగతం. కాకపోతే ఒంటరి పోరు చేస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి కోదండరామ్ సైతం కలిసి వచ్చేవారు. దీంతో ఈటల రాజేందర్ నిర్ణయంపై ఇంకా ఏం మాట్లాడినా వేరే అర్థాలు వస్తాయని పేర్కొన్నారు. మొత్తానికి ఈటల రాజేందర్ తీసుకున్ననిర్ణయంతో అందరి నోళ్లకు తాళం పడినట్లయింది.