Pakistan: పాలస్తీనాలోని హమాస్ మూడేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై చేసిన దాడిచేసి పలువురు ఇజ్రాయెలీలను అపహరించింది. దీని ఫలితంగా పాలస్తీనా ఇజ్రాయెల్ ఆగ్రహాన్ని ఇప్పటికీ చవిచూస్తోంది. హమాస్‌ను దాదాపు అంతం చేసినంత పనిచేసింది. గాజా మొత్తం శ్మశానంగా మారింది. కిడ్నాపర్ల చెర నుంచి ఇజ్రాయెలీలను విడిపించింది. ఇప్పటికీ శత్రుశేషం లేకుండా చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ బలగాలతోపాటు పాకిస్తాన్, యూఏఈ బలగాలనూ మోహరించాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో హమాస్ ప్రతినిధులు, పాకిస్తాన్‌లోని లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు భేటీ అయ్యారు. పాకిస్తాన్ గుజ్రాన్వాలాలో సమావేశం జరిగింది. పాక్ మర్కజే ముస్లిం లీగ్ నిర్వహించిన కార్యక్రమంలో హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్, లష్కర్ ఎ తోయిబా నుంచి రషీద్ అలీ సంధు హాజరయ్యారు. ఈ సమావేశం వీరి మధ్య సంబంధాలను బలోపేతం చేసే చర్చలకు దారితీసినట్లు నిఘా సమాచారం. ఈ సమావేశం ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
పాక్‌తో హమాస్ సంబంధం
2023 అక్టోబర్ 7 ఇజ్రాయెల్ దాడికి ముందు నాజీ జహీర్ పాకిస్తాన్‌ను సందర్శించి జమియత్ ఉలేమా–ఇ–ఇస్లాం అధిపతి మౌలానా ఫజల్–ఉర్–రెహ్మాన్‌ను కలిశారు. పహల్గామ్ దాడికి కొన్ని వారాల ముందు పీవోకేలో లష్కర్ ఎ తోయిబా ఆధ్వర్యంలో జరిగిన భారత వ్యతిరేక ర్యాలీల్లో కూడా పాల్గొన్నారు. ఒకవైపు పాకిస్తాన్ గాజాకు బలగాలను పంపుతుంటే.. తాజా సమావేశం పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రంగా మారుతున్నట్లు సూచిస్తోంది.
సమావేశంలో పాక్ సైన్యం..
గుజ్రాన్వాలా పీఎంఎంఎల్ కార్యక్రమంలో పాక్ సైన్య అధికారుల పాల్గొన్నట్లు నిఘా సమాచారం. ఈ సమావేశానికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లష్కర్ ఎ తోయిబా, హమాస్ మధ్య సహకారం పెంచుకోవడానికి ఈ సమావేశం ఉపయోగపడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇచ్చే సుదీర్ఘ చరిత్ర ఈ ఘటనతో మరింత బలపడింది.
ఈ సమావేశం ఉగ్రవాద గ్రూపుల మధ్య అంతర్జాతీయ సంబంధాలను పెంచుతుంది. లష్కర్ ఎ తోయిబా భారత్‌పై దాడులు చేస్తుంది. హమాస్ మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు కారణం. ఈ రెండు సంస్థలు కలిసి పనిచేస్తే భారత్, ఇజ్రాయెల్‌కు కొత్త సవాల్ ఎదురుకానుంది. భారత్‌లో పహల్గామ్ వంటి దాడులు, మధ్యప్రాచ్యలో ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకలాపాలకు దారితీయవచ్చు. అంతర్జాతీయ మీడియా ఈ సమావేశంపై దృష్టి పెట్టింది. భారత్, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలు పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.
Senior Hamas terrorist attended Lashkar-e-Taiba terrorist function as Chief guest in Gujranwala, Pakistan where many top Pakistan Army officers were present. Pakistan is becoming home of Hamas.
Don’t be surprised if India and Israel surprise Pakistan in the coming months. pic.twitter.com/ECA7RKS0J9
— Baba Banaras™ (@RealBababanaras) January 7, 2026