Raja Saab Ticket Prices: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(The Rajasaab Movie) మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్ టికెట్ రేట్స్ జీవో కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ జీవో లోని టికెట్ రేట్స్ చూసిన తర్వాత జనాలకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఈ రేట్స్ మీద పండక్కి సరదాగా కుటుంబం తో సినిమా చూసేదెలా?, సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో లేదు కదా, సినిమాకు టాక్ వస్తే చూసే వాళ్ళు చూస్తారు, ఒకవేళ టాక్ రాకపోతే మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశాలు లేవు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ అక్షరాలా వెయ్యి రూపాయిల వరకు ఉంటుందట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ వెయ్యి రూపాయిల టికెట్ రేట్ అన్ని ప్రాంతాల్లో ఉండదట. కేవలం వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి లాంటి సిటీస్ లో మాత్రమే ఉంటుందట. చిన్న సెంటర్స్ లో 600 లేదా 800 రేట్ కి టికెట్స్ ని విక్రయిస్తారట. ఇక రెగ్యులర్ షోస్ టికెట్ రేట్స్ సింగల్ స్క్రీన్ 296 రూపాయిలు, మల్టీప్లెక్స్ స్క్రీన్స్ 377 రూపాయిలు ఉంటుందట. మొదటి పది రోజుల పాటు ఈ టికెట్ రేట్స్ వర్తిస్తాయి. ఆ తర్వాత సింగిల్ స్క్రీన్స్ 144 , మల్టీప్లెక్స్ స్క్రీన్స్ 177 వరకు ఉంటుందని అంటున్నారు. పండగకి ఎంతో కొంత కలెక్షన్స్ కలిసొస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ ఒక కుటుంబం లో పది మంది ఉంటే, ఆ పది మంది సంక్రాంతికి థియేటర్ కి వచ్చి సినిమా చూడాలని అనుకుంటారు. మరి వాళ్లంతా కలిసి ఏ సినిమాని కూడాలంటే కనీసం 4000 రూపాయిలు అవుతుంది.
అంత రేట్ పెట్టి చూస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది వరకు ఓజీ చిత్రాన్ని ఇదే రేట్ మీద ఆడియన్స్ చూసారు కదా, మరి రాజా సాబ్ ని ఎందుకు చూడరు అని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు, ఇప్పుడు టికెట్ రేట్స్ పెంపు పై జనాల్లో తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడింది. అది ఈ సినిమాపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాకు ఓజీ కి ఉన్నంత క్రేజ్, హైప్ కూడా లేదు. అలాంటి సమయం లో ఇంత టికెట్ రేట్స్ పెడితే సినిమాకు ఓపెనింగ్స్ భారీగా బొక్క పడే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఆడియన్స్ ఈ చిత్రానికి ఎలాంటి ఫలితం ఇవ్వబోతున్నారు అనేది.