Apple iPhone: ప్రీమియం ఫోన్లను తయారు చేసే కంపెనీలలో ఆపిల్ నెంబర్ కూడా స్థానంలో ఉంటుంది. ప్రీమియం ఫోన్లలో హై ఎండ్ క్వాలిటీ తో ఉపకరణాలను ఆపిల్ తయారు చేస్తూ ఉంటుంది. వీటి ధర కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా లగ్జరీ కోరుకునే ప్రజలు ఈ ఫోన్లను ఇష్టపడుతుంటారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ లో ఆపిల్ కంపెనీ ఐఫోన్ కొత్త వెర్షన్ ను విడుదల చేస్తూ ఉంటుంది.
గత ఏడాది ఆపిల్ కంపెనీ ఐఫోన్ 17 వెర్షన్ విడుదల చేసింది. అయితే ఇది 18 నెలల వరకు ఫ్లాగ్ షిప్ నాన్ ప్రో మోడల్ గా ఉండడం టెక్ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆపిల్ కంపెనీ ప్లాగ్ షిప్ లైనప్ ను ఏటా అప్డేట్ చేయకపోవడం దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి. అంతేకాదు ఐఫోన్ 16 ఈ, ఐఫోన్ ఎయిర్ వంటి ఎనిమిది మోడల్స్ అమ్మకాల వ్యవధిని పొడిగించింది.
ఈ ఏడాది ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్ ను ఆపిల్ కంపెనీ విడుదల చేయబోతుంది. ఈ రెండు మోడల్స్ తో పాటు ఫోల్డబుల్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మోడల్ డిజైన్ లో అడుగడుగునా ఆధునికతత్వం కనిపిస్తోంది. ఇప్పటికే ఫోల్డబుల్ వేరియంట్ లో సాంసంగ్ లాంటి కంపెనీలు ఉన్నాయి. వాటి నుంచి పోటీని తట్టుకోవడానికి ఆపిల్ ఫోల్డబుల్ వేరియంట్ ను అందుబాటులోకి తీసుకొస్తుందని తెలుస్తోంది. ఫోల్డబుల్ వెర్షన్ లో ఏ20 ప్రో ఉంది. స్క్రీన్ కింద పేస్ ఐడి, ఫేస్ కటౌట్ ను తగ్గించింది. కెమెరా మెరుదలను, వేగవంతమైన చార్జింగ్ bu పెంచింది. ఇక ఐఫోన్ లో 18 వెర్షన్ 2027 వరకు మార్కెట్లోకి విడుదల కాదు. ఇది ఐఫోన్ 18 ఈ, ఐఫోన్ ఎయిర్ వంటి వేరియెంట్ల తో పాటుగా ఉంటుందని తెలుస్తోంది.
ఫోల్డబుల్ వెర్షన్ పుస్తకాకృతిలో ఉంటుంది. ఇది 5.7 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుంది. తెరిచినప్పుడు ఇది దాదాపు 8 అంగుళాల స్క్రీన్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రో మోడల్ మాదిరిగానే ప్రీమియం ఎంపికగా ఉంటుంది. కెమెరా నుంచి మొదలు పెడితే చార్జింగ్ వరకు ప్రతి విషయంలోనూ ఆపిల్ కంపెనీ అత్యంత జాగ్రత్తలు తీసుకుంది. గత మోడల్స్ లో ఉన్న లోపాలను పూర్తిగా సవరించింది. అయితే దీని ధర ఎంత ఉంటుందనేది ఆపిల్ కంపెనీ బయట పెట్టలేదు. బహుశా భారతీయ మార్కెట్లో లక్షకు మించి ధర ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.