Homeఎంటర్టైన్మెంట్Kalki 2 Bhishma Character: 'కల్కి 2' లో 'భీష్ముడు' పాత్ర ఎంట్రీ..నటించబోతున్న సూపర్ స్టార్...

Kalki 2 Bhishma Character: ‘కల్కి 2’ లో ‘భీష్ముడు’ పాత్ర ఎంట్రీ..నటించబోతున్న సూపర్ స్టార్ ఎవరో తెలుసా?

Kalki 2 Bhishma Character: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ప్రభాస్(Rebel Star Prabhas) ‘కల్కి 2898 AD’ ఒక అద్భుతం. ఇలాంటి కథ తో ఇప్పటి వరకు ఏ ఇండియన్ మేకర్ గతంలో ఆలోచన చేసి మన ముందుకు రాలేదు. కేవలం రెండు సినిమాల అనుభవం తో ఇంత గొప్ప విజన్ తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని తీర్చి దిద్దిన తీరుకి విమర్శకుల ప్రశంసలు అందడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల […]

Kalki 2 Bhishma Character: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ప్రభాస్(Rebel Star Prabhas) ‘కల్కి 2898 AD’ ఒక అద్భుతం. ఇలాంటి కథ తో ఇప్పటి వరకు ఏ ఇండియన్ మేకర్ గతంలో ఆలోచన చేసి మన ముందుకు రాలేదు. కేవలం రెండు సినిమాల అనుభవం తో ఇంత గొప్ప విజన్ తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని తీర్చి దిద్దిన తీరుకి విమర్శకుల ప్రశంసలు అందడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రీసెంట్ గానే మొదలైంది. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ వంటి వారు రీసెంట్ షెడ్యూల్ లో పాల్గొన్నారు. రేపటి తో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. తదుపరి షెడ్యూల్ లో ప్రభాస్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు.

Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!

ఇకపోతే ఈ చిత్రం నుండి హీరోయిన్ దీపికా పదుకొనే తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి సాయి పల్లవి ని తీసుకున్నారు. ఈమె కూడా తదుపరి షెడ్యూల్ లో పాల్గొనబోతుంది. ఈ ఏడాది లోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చెయ్యాలని చూస్తున్నారు. మహా భారతం కి సైన్స్ ఫిక్షన్ ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించగా, అర్జునుడిగా విజయ్ దేవరకొండ, అశ్వథామ గా అమితాబ్ బచ్చన్ కనిపించారు. ఈ పాత్రలు సీక్వెల్ లో కూడా ఉండబోతున్నాయి. ఈ పాత్రలతో పాటు భీష్ముడి పాత్ర కూడా సీక్వెల్ లో జాయిన్ అవ్వబోతుందట. ఈ పాత్ర కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ని సంప్రదిస్తున్నారట మేకర్స్ . ఆయన ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమా వేరే లెవెల్ కి చేరబోతోంది అనుకోవచ్చు. ఈ సినిమాలో క్లైమాక్స్ లో అర్జునుడు, కర్ణుడు, అశ్వథామ , భీష్ముడు కలిసి విలన్ సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్ ) తో తలపడనున్నారు.

మహాభారతం లో వీరులుగా చెప్పుకునే వీళ్లందరికంటే సుప్రీమ్ యాస్కిన్ ఎంత పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. మొదటి భాగం లో కమల్ హాసన్ కేవలం 7 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. అయినప్పటికీ ఆడియన్స్ కి థియేటర్స్ లో రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ అనుభూతి కలిగింది. ఇక ఈ సినిమాలో ఆయన ఆరంభం నుండి చివరి వరకు కనిపించబోతున్నాడు. ఇక వెండితెర పై కమల్ హాసన్ పాత్ర సృష్టించే విద్వంసం ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. అంతే కాకుండా భీష్ముడి పాత్రలో కమల్ హాసన్ తో సరిసమానమైన ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించే అవకాశం ఉండడంతో , క్లైమాక్స్ లో వీళ్లిద్దరి మధ్య కూడా పోరాట సన్నివేశం ఉంటుంది. ఇలాంటివి ఇంతకు ముందు మనం కేవలం కలల్లో మాత్రమే ఊహించుకొనేవాళ్ళం, ఇప్పుడు వెండితెర పై చూసే అదృష్టం కలగబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper