https://oktelugu.com/

గుంటూరు జిల్లా జవాను వీరమరణం

జమ్ముకశ్మీర్ రాజోరి జిల్లాలోని సుందర్ బాని సెక్టార్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికులు మనుప్రోలు జశ్వంత్ రెడ్డి (23) వీరమరణం పొందారు. ఈ మేరకు పట్టణంలోని దరివాద కొత్తపాలెంలోని తల్లిదండ్రులకు శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. జశ్వంత్ 2016లో మద్రాసు రెజిమెంట్ లో సైన్యంలో చేరారు. తొలుత నీలగిరిలో పనిచేసిన ఈయన ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. మరో నెలరోజుల్లో అతనికి వివాహం చేసేందుకు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 9, 2021 / 09:04 AM IST
    Follow us on

    జమ్ముకశ్మీర్ రాజోరి జిల్లాలోని సుందర్ బాని సెక్టార్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికులు మనుప్రోలు జశ్వంత్ రెడ్డి (23) వీరమరణం పొందారు. ఈ మేరకు పట్టణంలోని దరివాద కొత్తపాలెంలోని తల్లిదండ్రులకు శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. జశ్వంత్ 2016లో మద్రాసు రెజిమెంట్ లో సైన్యంలో చేరారు. తొలుత నీలగిరిలో పనిచేసిన ఈయన ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. మరో నెలరోజుల్లో అతనికి వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఉగ్రవాదుల కాల్పుల్లో కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.