https://oktelugu.com/

73వ వ‌సంతంలోకి ఏబీవీపీ.. దేశ‌వ్యాప్తంగా సంబ‌రాలు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ABVPగా సుప‌రిచిత‌మైన ఈ విద్యార్థి సంఘం పేరు వింటే జాతీయ వాదుల మ‌న‌సు పుల‌క‌రించిపోతుంది. అఖండ భార‌త్ నినాదం, హిందూ జాతీయ వాదాన్ని ర‌గిలించ‌డంతోపాటు విద్యార్థి స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మించేందుకు ఏర్ప‌డిన ఈ సంఘం.. ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్టుగా ఎదుగుతోంది. అనిత‌ర‌సాధ్య‌మైన ప్ర‌గ‌తిని న‌మోదు చేస్తోంది. ఇవాళ ABVP ఆవిర్భావ దినోత్స‌వం. దీంతో.. ఈ సంఘం శ్రేణులు దేశ‌వ్యాప్తంగా సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో.. ఏబీవీపీ చ‌రిత్ర‌ను ఓ సారి ప‌రిశీలిద్దాం. భార‌త‌దేశంలో […]

Written By:
  • Rocky
  • , Updated On : July 9, 2021 / 09:26 AM IST
    Follow us on

    అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ABVPగా సుప‌రిచిత‌మైన ఈ విద్యార్థి సంఘం పేరు వింటే జాతీయ వాదుల మ‌న‌సు పుల‌క‌రించిపోతుంది. అఖండ భార‌త్ నినాదం, హిందూ జాతీయ వాదాన్ని ర‌గిలించ‌డంతోపాటు విద్యార్థి స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మించేందుకు ఏర్ప‌డిన ఈ సంఘం.. ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్టుగా ఎదుగుతోంది. అనిత‌ర‌సాధ్య‌మైన ప్ర‌గ‌తిని న‌మోదు చేస్తోంది. ఇవాళ ABVP ఆవిర్భావ దినోత్స‌వం. దీంతో.. ఈ సంఘం శ్రేణులు దేశ‌వ్యాప్తంగా సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో.. ఏబీవీపీ చ‌రిత్ర‌ను ఓ సారి ప‌రిశీలిద్దాం.

    భార‌త‌దేశంలో హిందూత్వ జాతీయ‌వాదాన్ని సుస్థిరం చేయాల‌నే సంక‌ల్పంతో ఏర్ప‌డిన‌ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (RSS) ప‌రిధిలో అనేక శాఖ‌లు ఉన్నాయి. ఇందులో.. బీజేపీ నుంచి విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌ దాకా.. చాలా ఉన్నాయి. వాట‌న్నింటినీ క‌లిపి సంఘ్ ప‌రివార్ గా పిలుస్తుంటారు. ఇందులో ఒక‌టే ఏబీవీపీ. విద్యార్థుల్లోనూ జాతీయ వాదాన్ని మేల్కొల‌పాల‌నే ఉద్దేశంతో.. ఈ విద్యార్థి విభాగాన్ని సంఘ్ నేత‌లు ఆలోచించారు. అలా.. ఉద్భ‌వించిందే అఖిళ భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్‌.

    1948లో ఈ సంఘం ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. అయితే.. అధికారికంగా మాత్రం 1949 జూలై 9న ఆవిర్భ‌వించింది. హిందూ జాతి పున‌ర్ నిర్మాణం కోసం విద్యార్థుల‌ను సంఘ‌టిత శ‌క్తిగా మ‌ల‌చ‌డంలో భాగంగా ద‌త్తోపంత్ ఠెన్గ‌డీ త‌దిత‌రులు ఈ సంస్థ‌ను స్థాపించారు. అయితే.. తొలినాళ్ల‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. సుమారు ప‌దేళ్ల త‌ర్వాత 1958లో మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో ఉప‌న్యాస‌కుడిగా ఉన్న య‌శ్వంత్ రావ్ కేల్క‌ర్ ఈ సంస్థ ప్ర‌ధాన వ్య‌వ‌స్థాప‌కునిగా బాధ్య‌త‌లు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి ఏబీవీపీకి ఆయ‌నే ప్ర‌ధాన నిర్మాత‌గా, నిర్దేశ‌కుడిగా ఉన్నారు.

    ఆయ‌న సార‌ధ్యంలో ఏబీవీపీ విస్త‌ర‌ణ ఊపందుకుంది. విద్యార్థుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంతోపాటు ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేయ‌డం, ఇత‌ర సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిచ‌డం వంటివి చేస్తూ.. విద్యార్థుల్లోకి వేగంగా వెళ్లింది. 1987లో కేల్క‌ర్ మ‌ర‌ణించే వ‌ర‌కూ ఏబీవీపీని విస్తృతంగా విద్యార్థుల్లోకి తీసుకెళ్లారు. ఆ విధంగా విద్యార్థి ఉద్య‌మాల్లో త‌న‌దైన ముద్ర వేసిన ఈ ఆరెస్సెస్‌ అనుబంధ సంఘం.. ఇవాళ ఆవిర్భావ దినోత్స‌వం జ‌రుపుకుంటోంది. నేటితో 73 వ సంవత్సరం లోకి ప్రవేశించింది.

    ABVP అనే నాలుగు అక్షరాల మహత్తు ఏమిటో గాని ప్రారంభించబడిన నాటి నుండి నాలుగు దిశలలో విస్తరిస్తూనే ఉంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పాలిట వరమై, దేశద్రోహుల పాలిట సింహస్వప్నమై..
    అనేకమైన విద్యారంగాలలోకి ప్రవేశించి దిశా దర్శనం చేస్తోంది. MeDeVision పేరిట వైద్యవిద్యార్థులను, టెక్నికల్ సెల్ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థులను ఆక‌ట్టుకుంటోంది. ఇంకా.. Think India పేరుతో కేంద్రీయ విద్యా సంస్థల విద్యార్థులను, రాష్ట్రీయ కళా మంచ్ పేర విద్యార్థి కళాకారులకు స‌హ‌కారం అందిస్తూ.. విద్యార్థులలో జాతీయ భావన కాంక్షను రగిలిస్తూ.. విద్యా రంగంలో జాతీయ పునర్నిర్మాణం వైపు అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం 35 లక్షల సభ్యత్వం, 7000 స్థలాలకు పైగా పని కలిగి ఉండడం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా మారింద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా విద్యార్థి లోకం సంబ‌రాలు చేసుకుంటోంది.