ఐపీఎల్ లో 2022లో ఎంట్రీ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్. తొలి సీజన్ లోనే గుజరాత్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. గుజరాత్ జట్టుకు నాయకుడిగా నాటి సీజన్ లో హార్దిక్ పాండ్యా వ్యవహరించాడు. 2022లో విజేతగా నిలస్తే.. ఆ తదుపరి సీజన్ లో ఫైనల్ వరకు వెళ్లింది గుజరాత్ జట్టు.
అందరినీ ఆశ్చర్యపరిచింది
గుజరాత్ జట్టు తొలిసారి విజేతగా నిలవడం..రెండోసారీ ఫైనల్ దాకా వెళ్లడంతో అందరికీ ఆసక్తి పెరిగింది. ఆ తదుపరి సీజన్ లో గుజరాత్ జట్టు ఆట తీరు పూర్తిగా మారిపోయింది. జట్టు ప్లేయర్లలో సత్తా లోపించింది. సమష్టి తత్వం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో మూడో సీజన్ నుంచి గుజరాత్ జట్టు లో పటుత్వం లోపించి.. ఓటములను ఎదుర్కొడం ప్రారంభమైంది.
గిల్ నాయకత్వంలో..
పాండ్యా ముంబైకి వెళ్లిన తర్వాత గిల్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. గిల్ నాయకత్వంలో గుజరాత్ జట్టు 2024లో లీగ్ వరకే ఆగిపోయింది. గతేడాది ఎలిమినేటర్ దాకా వెళ్లింది. గత ఏడాది జరిగిన మెగావేలంలో గుజరాత్ జట్టు కొత్త కొత్త ప్లేయర్లను తీసుకుంది. ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్, బాంటన్, ల్యూక్ వుడ్ ను కొనుగోలుచేసింది. భీకరమైన ప్లేయర్లను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈసారి ఘన వైభవాన్ని చాటాలని గుజరాత్ జట్టు భావిస్తోంది. కొద్ది రోజులుగా టీ20 ఫార్మాట్ లో ఆకట్టుకోలేకపోతున్న గిల్ కు ఈ సీజన్ సవాల్ గా మారింది.
వారే కీలకం
గుజరాత్ జట్టులో సాయిసుదర్శన్, బట్లర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత సీజన్ లో వీరిద్దరూ దుమ్ము రేపారు. వీరిద్దరూ కనుక నిలబడితే ఈసారి గుజరాత్ ను ఆపడం ప్రత్యర్థి జట్లకే సవాలే. బౌలింగ్ లో కూడా గుజరాత్ బలంగా కనిపిస్తోంది. సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ బౌలింగ్ దళాన్ని మోస్తున్నారు. వీరికి ఇప్పుడు హోల్డర్ జతయ్యాడు. ఆశోక్ శర్మ కొత్తగా జట్టులో చేరడంతో బౌలింగ్ దళంలో పదునుకనిపిస్తోంది. ఆశోక్ శర్మ గంటకు 150కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడు. రబాడా, ల్యూక్ వుడ్, సాయికిశోర్ బంతితో అద్భుతాలు చేయగలరు.
వెంటాడుతున్న బలహీనతలు
గుజారాత్ జట్టులో కొన్నిబలహీనతలు అభిమానులను కలతకు గురి చేస్తున్నాయి. 2025లో రూథర్ ఫోర్డ్ అదరగొట్టినప్పటికీ..అతడిని ముంబై జట్టుకు వదిలేసింది. ఫిలిప్స్, బాంటన్ ఉన్నప్పటికీ.. వారి ప్రదర్శన నిలకడగా లేదు. గుజరాత్ జట్టులో కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. అతడికి కొద్ది రోజులుగా సరైన ప్రాక్టీస్ లేదు. ఫినిషర్ గా రాహుల్ తేవాటియా ఉన్నప్పటికీ..అతడికి సరైన సపోర్ట్ లేకపోవడంతో అది జట్టు విజయాల మీద తీవ్రంగా పడుతోంది. షారూఖ్ ఖాన్ మెరుపులు మెరిపించే ఆటగాడైనప్పటికీ అతడికి బలమైన అండ లభించాల్సి ఉంది. రషీద్ ఖాన్ స్టార్ స్పిన్నర్ అయినప్పటికీ.. రెండు సీజన్లలో అతడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. గత సీజన్ లో అతడు తొమ్మిది వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఇటీవలి టీ20 వరల్డ్ కప్ లో దారుణమైన ఆటతీరుతో బట్లర్ నిరాశపరిచాడు. గాయపడి విజయ్ హజార్ ట్రోఫీలో ఆడలేకపోయిన సాయిసుదర్శన్ ఏమేరకు ఫామ్ అందుకుంటాడో చూడాల్సి ఉంది.
డొమెస్టిక్ ప్లేయర్లు గిల్, గుర్నూర్ సింగ్, జయంత్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మానవ్, రాహుల్ తేవాటియా, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, ఇషాంత్, సిరాజ్, షారూఖ్, అర్షద్ ఖాన్, నిశాంత్ సంధు, అనూజ్ రావత్, సాయికిషోర్, అశోక్ శర్మ.
ఫారిన్ ప్లేయర్లు
బట్లర్, కుమార్ కుషాగ్ర, బట్లర్, బాంటన్, ల్యూక్ వుడ్, రషీద్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, హోల్డర్,రబాడా.
