
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. అయితే, తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేవరకు రాష్ట్రానికి కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని ఆయన సూచించారు. కర్ణాటకకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యెడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజుకి సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.