‘ఆర్ఆర్ఆర్’ కోసం అనిరుద్..: నిజమే

రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం సినీ ఆడియన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రాజమౌళి సినిమాలో కీరవాణి మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటిలో కీరవాణి మ్యూజికల్ సెన్సేషనల్స్ సృష్టించాడు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం మరింత పదును పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు విడుదలయిన ఫస్ట్ లుక్కల్లో వచ్చిన మ్యూజిక్ వింటేనే దిమ్మదిరుగుతుంది. ఇక సినిమాలో ఏ రేంజ్లో ఉంటుందోనని ఫ్యాన్ష్ […]

Written By: NARESH, Updated On : July 26, 2021 2:37 pm
Follow us on

రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం సినీ ఆడియన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రాజమౌళి సినిమాలో కీరవాణి మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటిలో కీరవాణి మ్యూజికల్ సెన్సేషనల్స్ సృష్టించాడు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం మరింత పదును పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు విడుదలయిన ఫస్ట్ లుక్కల్లో వచ్చిన మ్యూజిక్ వింటేనే దిమ్మదిరుగుతుంది. ఇక సినిమాలో ఏ రేంజ్లో ఉంటుందోనని ఫ్యాన్ష్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే సినిమా మ్యూజిక్ సంబంధించి లెటేస్టుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తమళ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం పనిచేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. కానీ లెటేస్టుగా స్వయంగా కీరవాణి అనిరుద్ విషయం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆయన సహకారంతో ఓ సాంగ్ ఉంటుందని కీరవాణి చెప్పడం ఆసక్తిగా మారింది.

ప్రమోషనల్ సాంగ్ కు అనిరుద్ సాయం తీసుకున్నమని, అతడి టాలెంట్, అతని టీం పై కీరవాణి ప్రశంసలు కురిపించడంతో అనిరుద్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. అనిరుద్ తో తన సెషన్ సాంగ్ చాలా బాగా వచ్చిందని కూడా అనడంతో సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇందుకు అనిరుద్ కూడా రిప్లై ఇచ్చాడు. ప్రముఖ డైరెక్టర్ కీరవాణి లాంటి గారితో పనిచేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.

యూత్ మైండ్ సెట్ ను బాగా అర్థం చేసుకునే అనిరుద్ తమిళ ఇండస్ట్రీల్లో ప్రముఖ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్ఆర్ఆర్ కోసం పనిచేస్తున్నాడంటే ఇందులో యూత్ ను ఆకట్టుకే విధంగా మ్యూజిక్ ను అందించవచ్చని అనుకుంటున్నారు. అయితే ఆ మ్యూజిక్ వినాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.