
హమీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈరోజు విశాఖపట్టణలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ మరింత పట్టుదలతో జగన్ ప్రభుత్వం పై పోరాటం చేయాలని సూచించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారం చేస్తుందని విమర్శించారు.