
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 83,885 మంది నమూనాలు పరీక్షించగా 3,166 కొత్త కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 4,019 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,356 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్ లో తెలిపింది.