
రాజధాని అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్ తమను మోసం చేశారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను రైతులు కలిశారు. రాజధాని భూములు ఇస్తే తమను రోడ్డున పడేశారని న్యాయం చేయమంటే అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. రైతలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జనసేన అండగా ఉంటుందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.