Road Accident: కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్ణాటకలో కోలార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ జీపును అతి వేగంతో సిమెంటు లారీ ఢీకొట్టడంతో ప్యాసింజర్ జీపులోని 8 మంది అక్కడికక్కడే మరణించారు, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం చింతామణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులు క్షతగాత్రులను రాయలపాడు మరియు మదనపల్లి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోలార్ కు చెందిన S R జాలప్ప ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి […]
కర్ణాటకలో కోలార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ జీపును అతి వేగంతో సిమెంటు లారీ ఢీకొట్టడంతో ప్యాసింజర్ జీపులోని 8 మంది అక్కడికక్కడే మరణించారు, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం చింతామణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులు క్షతగాత్రులను రాయలపాడు మరియు మదనపల్లి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోలార్ కు చెందిన S R జాలప్ప ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.