
మహారాష్ట్రలోని బద్దాపూర్ లోని ఓ రసాయన కర్మాగారం నుంచి గ్యాస్ లీకైంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణానష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజీ కావడంతో చుట్టు పక్కల వ్యాపించడంతో స్థానికులు కళ్ల మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతోందో తెలియక భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదంలో గురువారం రాత్రి 10.22 ప్రాంతంలో నోబెల్ ఇంటర్మీడియట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో జరిగింది. సంస్థలోని సల్ఫ్యుారిక్, బెంజైల్ ఆమ్లాల మధ్య రసాయన ప్రతిచర్యతో వేడెక్కడం వల్ల గ్యాస్ లీకేజీ ఏర్పాడిందని అగ్నిమాపక దళం అధికారి తెలిపారు.