గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో పురోగతి లభించింది. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు ఒప్పకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు విజయ్ తో కలిసి బాధితురాలు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో ఇష్టపూర్వకంగా వెళ్లిదా? లేదా అనే కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరిని కూడా పోలీస్ […]
గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో పురోగతి లభించింది. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు ఒప్పకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు విజయ్ తో కలిసి బాధితురాలు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో ఇష్టపూర్వకంగా వెళ్లిదా? లేదా అనే కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరిని కూడా పోలీస్ బృందం గుర్తించి స్టేషన్ కు తీసుకొస్తున్నట్లు సమాచారం.