Site icon OkTelugu

Anchor Anasuya: అందాల అనసూయ టాటూ వైరల్

తెలుగు బుల్లితెరపై చలాకీ మాటలతో అదిరిపోయే కురుచ దుస్తులతో హాట్ హాట్ గా కనిపించే అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది అనసూయనే. ఇక బుల్లితెరనే కాదు.. వెండితెరపై కూడా మంచి పాత్రల్లో నటిస్తూ అనసూయ గుర్తింపు తెచ్చుకుంటోంది.

క్షణక్షణం సినిమాలో కీలక పాత్రతో మెరిసిన అనసూయన అనంతరం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు వస్తే కాదనకుండా చేస్తోంది.

అనసూయ ప్రతీవారం జబర్ధస్త్ లో ఒక హాట్ డ్రెస్ వేసుకొని దాని మీద ఫొటో షూట్ చేసుకొని వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నెటిజన్లకు కన్నుల విందు పంచుతుంటుంది. తాజాగా ఒక గులాబీ రంగు పొట్టి డ్రెస్ లో అనసూయ ఫొటోషూట్ చేసింది.

ఎదపై ఓ టాటూ వేసుకొని అది కనిపించేలా ఫొటోలు దిగింది. అదేదో పేరులాగా కనిపిస్తోంది కానీ ఆ పేరు ఏంటన్నది మాత్రం సరిగ్గా అర్థం కావడం లేదు. ప్రస్తుతం అనసూయ టాటూ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version