
కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ పెషెంట్లకు ఆరోగ్య శ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను అదేశించారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని సూచించారు. ఎంప్యానెల్ చేసి ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలన్నారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా, తప్పనిసరిగా చేర్చుకోవాలని అధికారులను జగన్ స్పష్టం చేశారు.