
వైద్య ఆరోగ్యశాక అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయన ప్రగతి భవన్ కు వెళ్లారు. ప్రగతి భవన్ లోనే ఈ సమీక్ష నిర్వహించారు. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పై చర్చిస్తున్నారు. వీకెండ్ లాక్ డౌన్ పైనా అధికారులతో సీఎం కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్ పంపిణీ ప్రకియను మమ్మరం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.