
పశ్చిమ బెంగాల్లో కేంద్రమంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై జరిగిన దాడిని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో టీఎంసీ ప్రేరేపిత హింస తీవ్ర స్థాయిలో పెచ్చరిల్లిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగినట్లు చెబుతున్న పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా పంచ్ కూరి గ్రామంలో పర్యటించేందుకు ఇవాళ ఉదయం కేంద్ర విదేశాంగ సహాయమంత్రి మురళీధరన్ వెళ్లారు. ఈ సందర్భంగా కొందరు స్థానికులు కర్రలు, దుంగలతో వెంటపడుతూ ఆయన కారును ధ్వసం చేశారు.