
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నమూశారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిశారు. ఆయన స్వస్థలం హుజూరాబాద్ మండలం జూపాక. సాయిరెడ్డి గతంలో ఉమ్మడి కరీంనగర్ జడ్పీ చైర్మన్ గా కూడా పనిచేశారు. 1983, 1989లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. కాగా మంత్రి ఈటల రాజేందర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.