గ్యాస్ సిలిండర్ కంపెనీలలో ఒకటైన ఇండేన్ తమ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్తరకం గ్యాస్ సిలిండర్లను మార్కెట్ లోకి తెచ్చింది. ఎక్స్‌ట్రా తేజ్ సిలిండర్ల పేరుతో మార్కెట్ లోకి వచ్చిన గ్యాస్ సిలిండర్ల వల్ల కస్టమర్లకు రెండు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ గ్యాస్ సిలిండర్ల వల్ల 5 శాతం గ్యాస్ ను ఆదా చేసుకోవచ్చు.
అయితే ఈ గ్యాస్ సిలిండర్లను అందరూ వినియోగించుకోవడం సాధ్యం కాదు. కమర్షియల్ సిలిండర్లను వినియోగించే వాళ్లు మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్లను వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. ఈ గ్యాస్ సిలిండర్లు కుకింగ్ టైమ్ ను కూడా తగ్గించడం గమనార్హం. 19 కేజీలు, 47.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వినియోగించే వాళ్లు ఈ గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేయడం సులువుగా సాధ్యమవుతుంది.
ట్విట్టర్ ద్వారా ఇండేన్ ఈ గ్యాస్ సిలిండర్ల గురించి వెల్లడించింది. ఈ సిలిండర్లు గ్యాస్‌ను ఎక్కువ ప్రెజర్‌తో పంపించడం వల్ల గ్యాస్ ఆదా అయ్యే అవకాశాలు ఉంటాయి. 14 శాతం వరకు కుకింగ్ టైమ్ సేవ్ కానుండటంతో వంట ఫాస్ట్ గా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను వినియోగించే వాళ్లు సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ను సంప్రదించి ఈ సిలిండర్లను కొనుగోలు చేయవచ్చు.
ఇండేన్ గ్యాస్ ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొనిరాగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం.
#IndianOil brings to you #Indane XtraTej, a highly efficient Non-Domestic #LPG that offers minimum 5% savings in consumption of LPG and savings in cooking time too. For details https://t.co/yW2AZCrFHP pic.twitter.com/l3RMXTklSk
— Indian Oil Corp Ltd (@IndianOilcl) April 21, 2021
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More