
గత వారంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టచార్జీ (77) మంగళవారం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆక్సిజన్ స్థాయిలో 90 శాతం కంటే దిగువకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. బుద్ధదేవ్ ఇప్పటి వరకూ హోం ఐసోలేషన్ లో బీపీఏపీ సపోర్టు మీద ఉన్నారు. బుద్ధ దేవ్ క్రానిక్ అబ్ స్ట్రక్టి్ పల్మనరీ వ్యాధి కారణంగా ఆయన తరచుగా ఆస్పత్రిని సందర్శించాల్సి ఉంటుంది. ఈ నెల 18న ఆయనకు కరోనా నిర్థారణ అయింది.