https://oktelugu.com/

డీఆర్డీవోలో 47 ఉద్యోగ ఖాళీలు.. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా..?

కేంద్ర ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలోని డీఆర్‌డీఓ ఈ ఏడాది ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నోటిఫికేషన్లను రిలీజ్ చేసి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చిన డీఆర్డీవో తాజాగా మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 47 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం డీఆర్డీవో నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. అర్హత, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 26, 2021 / 09:09 AM IST
    Follow us on

    కేంద్ర ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలోని డీఆర్‌డీఓ ఈ ఏడాది ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నోటిఫికేషన్లను రిలీజ్ చేసి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చిన డీఆర్డీవో తాజాగా మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 47 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం డీఆర్డీవో నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. అర్హత, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    జూన్ 5 వ తేదీ వాకు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారు జోధ్‌పూర్‌లోని డిఫెన్స్ ల్యాబొరేట‌రీలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. https://apprenticeshipindia.org/ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 47 ఉద్యోగ ఖాళీలలో కోపా ఉద్యోగాలు 20 ఉండగా స్టెనోగ్రాఫ‌ర్‌- సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్ 10 కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వ‌ర్క్ మెయింటెనెన్స్ 3 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

    ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, డీజిల్ మెకానిక్, కార్పెంట‌ర్, ఐసీటీఎస్ఎం రెండు చొప్పున ప్లంబ‌ర్, వెల్డ‌ర్‌, ట‌ర్న‌ర్‌, మెషినిస్ట్‌, ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రీషియన్‌ పోస్టులు ఒక్కొక్క‌టి చొప్పున ఉన్నాయి. 2018 – 2020 మధ్య పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏడాది కాలం శిక్షణ ఉంటుంది. 2018 కంటే ముందు పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    అకడమిక్ మెరిట్ ఆరాధంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. శిక్షణ కాలంలో నెలకు 7,000 చొప్పున స్టైఫండ్ లభిస్తుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ లేకపోవడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.