భారత్ కు మే 1న స్పుత్నిక్‌-వీ మొదటి బ్యాచ్: ఆర్డీఐఎఫ్

రష్యాకు చెందిన  స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ మొదటి బ్యాచ్ మే 1న భారత్ కు అందజేయనున్నట్లు రష్యా డైరెక్టర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రివ్ పేర్కొన్నారు. అయితే మొదటి బ్యాచ్ లో ఎన్ని టీకాలు ఉంటాయో, ఎక్కడ తయారు చేస్తున్నారన్న వివరాలు మాత్రం చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్‌ -వీ  మార్కెటింగ్ చేస్తున్న రష్యా ఆర్ డీఐఎఫ్ సావరిన్ వెల్త్ ఫండ్, ఇప్పటికే ఐదు ప్రముఖ భారతీయ తయారీదారులతో సంవత్సరానికి 850 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ కోసం […]

Written By: Suresh, Updated On : April 27, 2021 9:30 am
Follow us on

రష్యాకు చెందిన  స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ మొదటి బ్యాచ్ మే 1న భారత్ కు అందజేయనున్నట్లు రష్యా డైరెక్టర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రివ్ పేర్కొన్నారు. అయితే మొదటి బ్యాచ్ లో ఎన్ని టీకాలు ఉంటాయో, ఎక్కడ తయారు చేస్తున్నారన్న వివరాలు మాత్రం చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్‌ -వీ  మార్కెటింగ్ చేస్తున్న రష్యా ఆర్ డీఐఎఫ్ సావరిన్ వెల్త్ ఫండ్, ఇప్పటికే ఐదు ప్రముఖ భారతీయ తయారీదారులతో సంవత్సరానికి 850 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ కోసం ఒప్పందాలు చేసుకుంది.