అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాను పోలీసుు అనేక కోణాలలో విచారిస్తుండడంతో పాటు ఆయన భార్యతో పాటు బంధువులని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తాజాగా శిల్పా శెట్టి, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయాలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ హజరత్ గంజ్, విభూతిఖండ్ పోలీస్ స్టేషన్ లలో వారిపై కేసు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్ సుమన్ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ, ఒక బృందం మంబై చేరుకుంది.