Homeజాతీయ వార్తలురేవంత్ రెడ్డికి సీనియర్లు హ్యాండ్ ఇచ్చారా?

రేవంత్ రెడ్డికి సీనియర్లు హ్యాండ్ ఇచ్చారా?

Revanth Reddyపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సీనియర్ నేతలు సహకరించడం లేదు. దీంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో రేవంత్ దూసుకుపోతుండగా ఆయనకు సీనియర్ నేతలు సహరించడం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలు ఆశించిన మేర విజయం సాధించడం లేదనే విషయం తెలుస్తోంది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన దళిత, గిరిజన దండోరా బహిరంగ సభకు సీనియర్లు పాల్గొనకుండా హ్యాండిచ్చారు. దీంతో పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.

పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి విఫలమైన కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీకి మెల్లగా దూరమవుతున్నారనే తెలుస్తోంది. సోమవారం ఇంద్రవెల్లి సభకు వారు హాజరు కాలేదు. దీంతో పార్టీలో సీనియర్లందరు సహకరించట్లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ ను ఏకాకిగా చేయడంలో భాగంగానే ఇలా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంద. దీంతో పార్టీ మనుగడ ఎలా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక ఉత్తమ్ వర్గంగా పేరుతెచ్చుకున్న జగ్గారెడ్డి సైతం సభకు గైర్హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ లో ఏం జరుగుతుందని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

పార్టీ వర్గాలు మాత్రం రేవంత్ వెంట ఉండడంతో ఆయన భయపడకుండానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీలో అలకబూనిన నేతలను సాధ్యమైనంత వరకు బుజ్జగించినా దారికి రాని వారితో ఇక పని లేదని రేవంత్ నిర్ణయించుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పుడు పదవులు సిద్దంగా ఉంటాయని చెబుతూ ఎవరు రాకపోయినా పార్టీ సేవలు ఆగవని చెప్పారు. ఇక పార్టీలో కౌశిక్ రెడ్డి సృష్టించిన హంగామాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి బలి అవుతున్నారు. కౌశిక్ రెడ్డి ఉత్తమ్ కు దగ్గర బంధువు కావడంతో ఆయనపైనే ఆరోపణలు వస్తున్నాయి.

దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో సీనియర్ల ప్రాతినిధ్యం కనిపించడం లేదు పదవి ఆశించి భంగపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పూర్తిగా పార్టీని పట్టించుకోవడం లేదు. తనకేం సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా పాల్గొనకుండా తనలోని అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైనే పార్టీ పూర్తి స్థాయి బాధ్యతలు ఉంచడంతో ఆయన న్యాయం చేయాలని చూస్తున్నా సీనియర్ల అలకతో పార్టీ కొంతమేర నష్టపోతున్నట్లు తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version