క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త

విశ్వక్రీడలు ఒలింపిక్స్ లో క్రికెట్ ను భాగం చేేసేందుకు ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా ఐసీసీ ఒలింపిక్స్ లో జెంటిల్ మెన్ గేమ్ క్రికెట్ ను చేర్చేందుకు ఐఓసీకి ప్రతిపాదించింది. దీనికోసం బిడ్ కూడా వేయనున్నట్లు ప్రకటించింది. ఐసీసీ ప్రయత్నాలు ఫలించి, అన్ని అనుకున్నట్లు జరిగితే 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో మనం క్రికెట్ ను చూడొచ్చు. ఈ మేరకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఒలింపిక్స్ లో క్రికెట్ ను భాగం చేసేందుకు […]

Written By: Suresh, Updated On : August 10, 2021 1:35 pm
Follow us on

విశ్వక్రీడలు ఒలింపిక్స్ లో క్రికెట్ ను భాగం చేేసేందుకు ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా ఐసీసీ ఒలింపిక్స్ లో జెంటిల్ మెన్ గేమ్ క్రికెట్ ను చేర్చేందుకు ఐఓసీకి ప్రతిపాదించింది. దీనికోసం బిడ్ కూడా వేయనున్నట్లు ప్రకటించింది. ఐసీసీ ప్రయత్నాలు ఫలించి, అన్ని అనుకున్నట్లు జరిగితే 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో మనం క్రికెట్ ను చూడొచ్చు. ఈ మేరకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఒలింపిక్స్ లో క్రికెట్ ను భాగం చేసేందుకు ఏర్పాటైన ఐసీసీ సభ్యల బృందం వెల్లడించింది. 2028లొ కచ్చితంగా ఒలింపిక్స్ లో క్రికెట్ ఉండేటట్లు చూస్తామని కూడా వారు పేర్కొన్నారు.