https://oktelugu.com/

తన ‘కళావతి’కి మహేష్ స్పెషల్ మెసేజ్ !

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో కీర్తి సురేష్ నటిస్తోంది అనగానే ఈ కలయిక పై అభిమానుల్లో మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ అంత గొప్పగా ఆకట్టుకుంది. అందుకే, మహేష్ సరసన హీరోయిన్ అనగానే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనికి తోడు వీరి లవ్ ట్రాక్ అదిరిపోతోంది అంటూ ఇప్పటికే అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా స్పెషల్ వీడియో. ‘సూపర్‌ స్టార్‌ బర్త్‌డే […]

Written By:
  • admin
  • , Updated On : August 10, 2021 / 01:32 PM IST
    Follow us on

    సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో కీర్తి సురేష్ నటిస్తోంది అనగానే ఈ కలయిక పై అభిమానుల్లో మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ అంత గొప్పగా ఆకట్టుకుంది. అందుకే, మహేష్ సరసన హీరోయిన్ అనగానే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనికి తోడు వీరి లవ్ ట్రాక్ అదిరిపోతోంది అంటూ ఇప్పటికే అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా స్పెషల్ వీడియో.

    ‘సూపర్‌ స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ పేరుతో వచ్చిన ఈ సినిమా టీజర్‌ లో మహేష్ యంగ్‌ లుక్ లో సూపర్‌ స్టైలిష్‌ గా కనిపించడం ఒక ఎత్తు అయితే, మహేష్ గురించి కీర్తి సురేష్ చెప్పిన డైలాగ్.. ముఖ్యంగా మహేష్ ను చూస్తూ ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మరో ఎత్తు. మొత్తానికి ఒకటి రెండు షాట్స్ లోనే ఈ జోడి చూడముచ్చటగా ఉంది అనిపించారు.

    ముఖ్యంగా ‘పడుకునేముందు దిష్టి తీసుకోవడం మర్చిపోకండి’ ఆని కీర్తి సురేష్ చెప్పిన క్యూట్‌ డైలాగ్ ఇప్పుడు ఈ జంటకే వర్తించేలా ఉంది. అంతలా వీరిద్దరిపై పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, కీర్తీ మహేష్ బర్త్‌ డేకు విష్ చేస్తూ ‘నమత్ర మేడం, సార్‌ పడుకునేముందు దిష్టి తీయడం మర్చిపోకండి’ అని ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఒక మెసేజ్ పెట్టింది.

    కీర్తి ఇన్‌ స్టా పోస్టు బాగా వైరల్‌ అయింది కూడా. అయితే, మహేష్ తన పుట్టిన రోజున విషెస్‌ చెప్పిన అందరికీ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు చెప్పాడు. ఈ సందర్భంగా కీర్తికి కూడా స్పెషల్ గా మెసేజ్ చేస్తూ ‘థ్యాంక్యూ కళావతి’ అని పోస్ట్ పెట్టాడు. అంటే.. ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి పాత్ర పేరు ‘కళావతి’ అని తేలిపోయింది. పేరులోనే మంచి కళ ఉంది కాబట్టి.. ఆమె పాత్ర కూడా అంటే కళగా ఉంటుంది ఏమో చూడాలి.

    కాగా పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 ప్లస్‌ రీల్స్‌ సంస్థలు ఈ ‘సర్కారు వారి పాట’ను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక తమన్‌ మ్యూజిక్ ఈ సినిమాకి స్పెషల్ కానుంది.