కేరళ ఫాదర్ కు ఫేస్బుక్ ద్వారా ఒక మహిళా పరిచయం అయింది. పరిచయం ఐన కొద్దీ రోజుల్లోనే ఆమె 3.5లక్షల వరకు దోచుకుంది. బాదితుడి కథనం ప్రకారం ఫేస్బుక్ లో తానొక బ్రిటిష్ మహిళగా పరిచయం అయ్యి మాటలు కలిపింది. ఐఫోన్, ల్యాప్ టాప్ , విలువైన ఆభరణాలు పంపిస్తానని మొబైల్ నంబర్, ఈమెయిలు ఐడి తీసుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత రోజే ఢిల్లీ ఐజీఐ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులుగా ఫోన్ చేసి కస్టమ్స్ డ్యూటీ కింద 3.5లక్షలు చెల్లించాలని అకౌంట్ వివరాలు తెలిపారు. కొన్ని రోజులు ఐన తర్వాత కూడా పార్సిల్ రాకపోవడంతో పోలీసులకు పిర్యాదు చెయ్యగా ఉత్తరప్రదేశ్ లోని ఒకరి ఖాతాలో డిపాజిట్ ఐనట్లు తేలింది. పోలీసులు ఉత్తరప్రదేశ్ కు చెందిన అఖిల్ నబీ అనే మహిళాను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కొడాలి నాని.. తెలుసుకొని మాట్లాడు.. ఇదీ మోడీ రామభక్తి