వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రేపు భారత్‌ బంద్‌..

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం భారత్‌బంద్‌కు రైతుసంఘాలు పిలుపునిచ్చాయి. ఆల్‌ఇండియా పార్మర్స్‌ యూనియన్‌, భారతీయ కిసాన్‌ యూనియన్‌, ఆల్‌ ఇండియా కిసాన్‌ మహాసంఘ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సంయుక్తంగా ఈ బంద్‌కు పిలుపునివ్వగా ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. వ్యవసాయం బిల్లు వివిధ రాష్ట్రాల నుంచి నిరసనలు వెల్లువడుతున్న నేపథ్యంలో ముందుగా పంజాబ్‌ బంద్‌కు ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నిరసనకు 31 రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి. దేశంలో […]

Written By: NARESH, Updated On : September 24, 2020 8:02 pm

rythu

Follow us on

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం భారత్‌బంద్‌కు రైతుసంఘాలు పిలుపునిచ్చాయి. ఆల్‌ఇండియా పార్మర్స్‌ యూనియన్‌, భారతీయ కిసాన్‌ యూనియన్‌, ఆల్‌ ఇండియా కిసాన్‌ మహాసంఘ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సంయుక్తంగా ఈ బంద్‌కు పిలుపునివ్వగా ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. వ్యవసాయం బిల్లు వివిధ రాష్ట్రాల నుంచి నిరసనలు వెల్లువడుతున్న నేపథ్యంలో ముందుగా పంజాబ్‌ బంద్‌కు ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నిరసనకు 31 రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి. దేశంలో అత్యదికంగా వ్యవసాయం చేస్తున్న పంజాబ్‌లో మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌, హర్యానా , మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో సైతం బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించారు. అయితే ప్రతిపక్షాలు సైతం మద్దతు ప్రకటించి దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు.

Also Read: స్వతంత్ర రైతు సంఘాలే కావాలి నినాదం