తెలంగాణ రాష్ర్ట సమితి హుజురాబాద్ పై దృష్టి సారించింది. ఉప ఎన్నికకు ఇప్పటి నుంచే పోరాటం మొదలుపెట్టింది. ఈటల రాజేందర్ ను నిలువరించాలనే ఉద్దేశంతో సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ బలగాన్ని అక్కడికి తరలిస్తోంది. చోటామోటా నాయకులు కూడా అటు వైపే నడుస్తున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తమకే అనుకూలంగా ఉండానే ఉద్దేశంతో అధికార పార్టీ పలు మార్గాలు అన్వేషిస్తూ ముందుకు వెళ్తోంది.
అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో విజయమే లక్ష్యంగా గురి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ నుంచి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. హుజురాబాద్ లో మీ అధికారం, డబ్బు సంచులు తాత్కాలికంగా గెలిచినా అంటూ మాట్లాడడంతో గెలుపు చాన్స్ లేదని ఒప్పుకున్నట్లుగా భావిస్తున్నారు.
ఈటల రాజేందర్ స్వతంత్రంగానే పోటీ చేయాలనుకున్నారు. ఆయన అనుచరులు కూడా ఆయనతో రావడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం రకరకాల కుట్రలతో ఈటలను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో సొంత వాళ్లను కలవడానికి సైతం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే ఉప ఎన్నిక వరకు ఎలా ఉంటుందోనని వాపోతున్నారు.
బీజేపీలో చేరిక నిర్ణయం తీసుకున్న ఈటల వ్యూహాత్మకంగా బీజేపీ దగ్గర నుంచి పెద్ద పదవులే ఆఫర్ గా పొందారు. ఉప ఎన్నికలో హుజురాబాద్ నుంచి తన భార్యను నిలబెట్టాలని చూస్తున్నారు. ఆమె రెడ్డి సామాజికవర్గానికి చందిన వారిని ఇటీవల ప్రచారం సాగింది. ఇక ఈటల సామాజిక వర్గం అండ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ కూడా నాగార్జునసాగర్ తరహా ఫలితం వస్తుందని ఈటల నమ్ముతున్నందునే అధికార పార్టీకి విజయం వస్తుందని ఒప్పుకుని ఈ విధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.