
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టింది. క్లరికల్ క్యాడర్ లో 5121 కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తున్నది. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న దరఖాస్తు ముగుస్తుండగా దానిని మరో మూడో రోజుల పాటు ఎక్స్ టెండ్ చేసింది. దీంతో ఈ నెల 20 వరకు అదికారిక వెబ్ సైట్లో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది.