కరోనా రెండో దశ కల్లోలం కొనసాగుతున్నది. దీంతో పంజాబ్ లో కరోనా కేసులతోపాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కేవలం 44 రోజుల్లోనే మొత్తం మరణాల్లో 40 శాతం నమోదయ్యాయంటే కరోనా ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ లో మార్చి 31 నాటికి 6868 మంది బాధితులు మరణించారు. మే 14 నాటికి ఆ సంఖ్య 11,477 కు చేరింది. అంటే 44 రోజుల్లో 4609 మంది మరణించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజు వంద మందికి పైగా మరణిస్తున్నారు. మార్చి 31 నాటికి 2,39,734 కేసులు ఉండగా, మే 14 నాటికి ఆ సంఖ్య 4,83,984 కు పెరిగింది.