
మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం, టీకాలు తదితర అంశాలపై ఠాక్రే మోదీతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఠాక్రే ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ని రాష్ట్ర ప్రతినిధుల బృందం ఈ ఉదయం దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఠాక్రే బృందం లోక్ కల్యాణ్ మార్గలోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు.