
తన వివరణ తీసుకోకుండానే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 19 ఏళ్ల తెరాస అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ శివారు శామీర్ పేట నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. తెరాస నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచాని చెప్పారు. సీఎం కేసీఆర్ కుమార్తెకు బీ ఫాం ఇచ్చినా ఆమె ఓడిపోయిందన్నారు.