https://oktelugu.com/

అవును ప్రేమలో పడ్డాను – అడవి శేష్

‘అడివి శేష్’ అమెరికా నుండి వచ్చిన పేద కళాకారుడు, ఈ విషయాన్ని శేషే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. రూమ్ రెంట్ కట్టడానికి ఐదు వేలు కూడా లేని దుస్థితిలో తానూ ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పుకుని శేష్ ఎమోషనల్ అయినప్పుడు, అందరూ షాక్ అయ్యారనే చెప్పాలి. శేష్ లుక్ కి, శేష్ మాటలకూ అసలు పొంతన లేదు మరి. ఏది ఏమైనా జీరో నుండి మైనస్ లోకి వెళ్లి, ప్రస్తుతం పది కోట్లు మార్కెట్ ను […]

Written By:
  • admin
  • , Updated On : June 4, 2021 / 10:11 AM IST
    Follow us on

    ‘అడివి శేష్’ అమెరికా నుండి వచ్చిన పేద కళాకారుడు, ఈ విషయాన్ని శేషే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. రూమ్ రెంట్ కట్టడానికి ఐదు వేలు కూడా లేని దుస్థితిలో తానూ ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పుకుని శేష్ ఎమోషనల్ అయినప్పుడు, అందరూ షాక్ అయ్యారనే చెప్పాలి. శేష్ లుక్ కి, శేష్ మాటలకూ అసలు పొంతన లేదు మరి.

    ఏది ఏమైనా జీరో నుండి మైనస్ లోకి వెళ్లి, ప్రస్తుతం పది కోట్లు మార్కెట్ ను క్రియేట్ చేసుకుని వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. తనకు మాత్రమే సాధ్యం అన్నట్టు వైవిధ్యమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న అడివి శేష్ కి, లేడీస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎంతైనా అందగాడు. అందుకే అమ్మాయిల నుండి ప్రపోజల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయట.

    అయితే ‘అడివి శేష్’ ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని అడివి శేష్ స్వయంగా చెప్పి, తన ఫిమేల్ ఫాలోవర్స్ ను నిరాశ పరిచాడు. మరి ఈ హ్యాండ్సమ్ హీరోని ప్రేమలో పడేసిన ఆ అమ్మాయి గురించి మాత్రం ఇంకా శేష్ ఏ విషయం చెప్పలేదు. ఆమె పేరు చెప్పేందుకు తాను ఇంకా ఆమె పర్మిషన్ తీసుకోలేదని, కానీ త్వరలోనే ఆమె అనుమతితో ఆమె పేరును బయటపెడతాను అని చెప్పుకొచ్చాడు.

    అయితే, పెళ్లికి ఇంకా టైముందని చెబుతున్నాడు ఈ కుర్రహీరో. ప్రస్తుతం మహేష్ బాబు నిర్మాణంలో శేష్ ‘మేజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి, ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ‘హిట్ 2’లో కూడా శేష్ హీరోగా నటించనున్నాడు. ఇక గతంలో అడవి శేష్ లవ్ లైఫ్ గురించి అనేక రూమర్స్ వచ్చాయి. శేష్ తాజా స్టేట్ మెంట్ తో అవి ఒట్టి రూమర్సే అని తేలిపోయింది.