
మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ప్రజాదీవెన పాదయాత్ర హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరో రోజు కొనసాగింది. చిన్న కోమటిపల్లె నుంచి ఇవాళ ఆయన యాత్ర ప్రారంభించారు. అంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా చిన్నకోమటిపల్లెలో మహిళలు ఈటలకు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు సంఘీభావం తెలిపారు.