తెలంగాణలోని భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక, రెవెన్యూ అధికారులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. భూముల డిజిటల్ సర్వే చేసేందుకు ఆసక్తి కనబరిచిన వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిన్నే ప్రాథమికంగా సమావేశమై సర్వే సంబంధిత అంశాలపై చర్చించారు.