
బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు తెలంగాణ ప్రభుత్వం నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కోఠిలోని ఈఎస్ టీ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా అధికారులు ప్రకటించారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొందరికే బ్లాక్ ఫంగస్ సమస్య ఉందని డీఎం ఈ తెలిపారు. బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారిలో ఈఎస్ టీ సమస్యలు వస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అయిన బాధితులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తామన్నారు. ఆప్తమాలజీ వైద్యుడి అవసరం సరోజిని దేవీ ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు.