
ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్రా అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈమేరకు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. రాష్ట్రం మళ్లీ కోలుకోలేనంత అప్పుల ఊబిలోకి వెళ్లిందని ఆరోపించారు. వైకాపా సర్కారు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తోందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బలోపేతం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సుదీర్ఘ తీరప్రాంతం, ఆర్థిక వనరులు ఉన్నా.. అప్పులు పెరిగాయని సోము వీర్రాజు విమర్శించారు.