
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ పీఠాన్ని వైకాపా దక్కించుంది. ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో 27 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉండగా ఎన్నికలకు ముందే 3 ఏకగ్రీవమయ్యాయి. దీంతో మార్చి 10న మొత్తం 47 డివిజన్లకే ఎన్నికలు జరిగాయి. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో లెక్కింపులో మొత్తం డివిజన్ల లో సగం కంటే ఎక్కువ ఇప్పటికే వైకాపా ఖాతాలో చేరడంతో ఆ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం లాంఛనం కానుంది.