యోగిని కొడతారా? అఖిలేష్ తో నిలబడతారా?

దేశంలో రాజకీయాలు మారుతున్నాయి. రోజురోజుకు సమీకరణలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అధికారమే లక్ష్యంగా పొత్తులకు ఎత్తులు వేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావాన్ని తగ్గించేందుకు తమ పలుకుబడిని ఉపయోగించుకుంటున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎలాగైనా బీజేపీని ఢీకొట్టాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎంఐఎం తో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రంగు మారనున్నాయని సమాచారం. దేశంలోని అన్ని స్టేట్లలో పెద్ద రాష్ర్టంగా ఉన్న […]

Written By: Srinivas, Updated On : July 25, 2021 2:20 pm
Follow us on

దేశంలో రాజకీయాలు మారుతున్నాయి. రోజురోజుకు సమీకరణలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అధికారమే లక్ష్యంగా పొత్తులకు ఎత్తులు వేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావాన్ని తగ్గించేందుకు తమ పలుకుబడిని ఉపయోగించుకుంటున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎలాగైనా బీజేపీని ఢీకొట్టాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎంఐఎం తో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రంగు మారనున్నాయని సమాచారం.

దేశంలోని అన్ని స్టేట్లలో పెద్ద రాష్ర్టంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో పట్టు సాధించాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. రాష్ర్టంలో సమాజ్ వాదీ ప్రభుత్వం ఏర్పడితే ముస్లిం నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అయితే అందులో నిజం లేదని ఎంఐఎం నేతలు స్పష్టం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కచ్చితంగా ఢీకొనేందుకు సిద్దమైనా, సమాజ్ వాదీత పొత్తు వట్టిదేనని పార్టీ యూపీ విభాగం అధ్యక్షుడు షౌకత్ అలీ తెలిపారు.

యూపీలో ఎంఐఎం పొత్తు ఉంటే వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కూడా అంగీకారం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అదంతా వట్టిదేనని ఎంఐఎం వర్గాలు ఖండిస్తున్నాయి. యూపీలో పొత్తుపై ఎలాంటి ప్రకటన లేదని చెబుతున్నారు. మహారాష్ర్టలో రెండు ఎంపీ, ఎమ్మెల్యేల విజయంతో మజ్లిస్ విస్తరణ ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్ లో పరాభవం ఎదురైనా యూపీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నట్లు సమాచారం.

యూపీలో 404 సీట్లుండగా 110 చోట్ల ముస్లిం ఓటర్లు 30 నుంచి 39 శాతం వరకు ఉన్నారు. 44 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలు 40 నుంచి 49 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. 11 స్థానాల్లో 50 నుంచి 65 శాతంగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈసారి యూపీలో వంద సీట్లలో మజ్లిస్ పోటీకి సిద్ధపడుతోంది. ఏది ఏమైనా యూపీలో ఎంఐఎం తన ప్రభావాన్ని చూపించుకోవడానికి తయారుగా ఉన్నట్లు తెలుస్తోంది.